ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగంతోనే స్వేచ్ఛ, హక్కులు

ABN, First Publish Date - 2022-11-27T00:08:17+05:30

ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు కల్పించిందే రాజ్యాంగమని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యాంగ దినోత్సవంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌

సంగారెడ్డి రూరల్‌, నవంబరు 26: ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు కల్పించిందే రాజ్యాంగమని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌ అన్నారు. భారత రాజ్యాంగ దినోవత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రక్షణలో పోలీసు అధికారులు తమ బాధ్యతను సక్రమంగా అమలు చేసి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ జనార్ధన్‌, ఎస్‌బి సీఐ మహే్‌షగౌడ్‌, డీపీవో సూరింటెండెంట్‌ అశోక్‌, వెంకటేశం, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. కాగా సంగారెడ్డిలోని పోలీస్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సమావేశంలో ఎస్‌బీ సీఐ మహే్‌షగౌడ్‌, డీపీవో సూరింటెండెంట్‌ అశోక్‌, వెంకటేశం, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో పైరవీలకు తావులేదని ఎస్పీ రమణకుమార్‌ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఫిజికల్‌ ట్రెయినింగ్‌ పొందుతున్న అభ్యర్థుల వద్దకు వెళ్లి ఎస్పీ మాట్లాడారు.

హక్కులపై అవగాహన అవసరం: అదనపు కలెక్టర్‌ రమేష్‌

మెదక్‌ అర్బన్‌, నవంబరు 26: భారత రాజ్యాంగాన్ని ప్రతీ ఒక్కరూ చదివి మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని మెదక్‌ అదనపు కలెక్టర్‌ రమేష్‌ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పునరంకితమవుతాని అధికారులు, సిబ్బందితో భారత సంవిధాన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీవైఎ్‌సవో నాగరాజు, మత్స్యశాఖ ఏడీ రజిని, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్‌ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ కృషి కారణంగానే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని టీఎన్జీవో జిల్లా అఽధ్యక్షుడు నరేందర్‌ పేర్కొన్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో భారత రాజ్యాంగం ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఇక్బాల్‌పాషా, రాధా, విష్ణువర్ధన్‌రెడ్డి, గోపాల్‌, సంతోష్‌, సలీం, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T00:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising