ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి : ప్రతిమాసింగ్‌

ABN, First Publish Date - 2022-01-20T04:30:53+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో 317 ప్రకారం జిల్లాలోని ఉద్యోగుల స్థానిక కేడర్ల కేటాయింపు ప్రక్రియ ముగిసిందని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు.

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, జనవరి 19 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో 317 ప్రకారం జిల్లాలోని ఉద్యోగుల స్థానిక కేడర్ల కేటాయింపు ప్రక్రియ ముగిసిందని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, నూతన సంవత్సర క్యాలెండర్‌ను అదనపు కలెక్టర్‌ రమే్‌షతో కలిసి ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. కేడర్‌ సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. ప్రక్రియ పూర్తికి కష్టపడి పనిచేసిన అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులను అభినందించారు. అదనపు కలెక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ టీఎన్జీవో సంఘంతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉన్నదన్నారు. జిల్లా ఉద్యోగుల సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే, పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శి దొంత నరేందర్‌, రాజ్‌కుమార్‌, సహ అధ్యక్షుడు సాధిక్‌అలీ, ఉపాధ్యక్షురాలు అనురాధ, ఉపాధ్యక్షుడు మనోహర్‌, ఫణిరాజ్‌, ఇక్బాల్‌పాషా, అర్షద్‌, ఫజల్‌వొద్దీన్‌, రఘునాఽథ్‌రావు, వినోద్‌కుమార్‌, రామాగౌడ్‌, నర్సాపూర్‌, ఏడుపాయల, చేగుంట, రామాయంపేట, తూప్రాన్‌ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు శేషాచారి, సూర్యశ్రీనివా్‌సగౌడ్‌, విజయ్‌కుమార్‌ ప్రభాకర్‌, శంకర్‌గౌడ్‌, సల్లావొద్దిన్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising