ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులపై తూప్రాన్‌లో కలెక్టర్‌ సమీక్ష

ABN, First Publish Date - 2022-11-29T23:44:49+05:30

తూప్రాన్‌లో మండల ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ హరీష్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి పనులు పూర్తి చేయాలని సూచించారు.

తూప్రాన్‌లో అధికారులతో కలెక్టర్‌ హరీష్‌ సమీక్ష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, నవంబరు 29: తూప్రాన్‌లో మండల ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ హరీష్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి పనులు పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, అదనపు కలెక్టర్‌ రమేష్‌, తూప్రాన్‌ ఇన్‌చార్జి ఆర్డీవో సాయిరాంలతో సమీక్షా కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. మనోహరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసు కాంప్లెక్స్‌ భూసేకరణకు ట్రేజరీ క్లియరెన్స్‌ లభించిందని, వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్‌ శివారులో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్‌ పార్కు భూసేకరణలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు 358 మందికి వారం రోజుల్లో ప్లాటింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. తూప్రాన్‌పట్టణంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ పరిధిలో రూ. 20 కోట్ల పనులపై ప్రశ్నించగా, టెండర్‌ ప్రాసె్‌సలో ఉన్నట్లు కమిషనర్‌ మోహన్‌ తెలిపారు. పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరెడ్డి, డీఈ నర్సింలు, ఏఈ జుంకీలాల్‌, టీఎ్‌సఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మాధవి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T23:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising