పలు వార్డుల్లో పర్యటించిన చింతా ప్రభాకర్
ABN, First Publish Date - 2022-03-15T05:39:12+05:30
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఆయా వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మీరవి, వైస్ చైర్‌పర్సన్ లతావిజయేందర్‌రెడ్డితో పాటు కౌన్సిలర్లతో కలిసి ఐదు వార్డుల్లో పర్యటించారు.
సంగారెడ్డి టౌన్, మార్చి 14 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఆయా వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మీరవి, వైస్ చైర్‌పర్సన్ లతావిజయేందర్‌రెడ్డితో పాటు కౌన్సిలర్లతో కలిసి ఐదు వార్డుల్లో పర్యటించారు. తొలిరోజు ఆరు వార్డుల్లో పర్యటించిన రెండోరోజు 4,5,25,26,38 వార్డుల్లో పర్యటించారు. సోమేశ్వరవాడ, గంజిమైదాన్, నాల్‌సాబ్‌గడ్డ, రిక్షా కాలనీల్లో పర్యటిస్తూ శిథిలావస్థకు చేరుకున్న మురుగు కాలువలు, గుంతలమయమైన రోడ్లు, అధ్వాన్నంగా మారిన బొబ్బిలికుంట కట్టను పరిశీలించారు. వార్డుల పర్యటన అనంతరం వైఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన నారాయణఖేడ్ సభలో సీఎం ప్రకటించిన ప్రకారం సంగారెడ్డి మున్సిపల్‌కు రూ.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.50 కోట్ల నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎం ఆదేశాల మేరకు పర్యటించి సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. ఈ పర్యటనలో కౌన్సిలర్లు సాబేర్, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బొంగుల రవి, అజ్జు పైల్వాన్, టీఆర్‌ఎస్ నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింహులు, శ్రావణ్‌రెడ్డి ఉన్నారు.
Updated Date - 2022-03-15T05:39:12+05:30 IST