ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెకుముకి పోటీలతో సైన్స్‌పై ఆసక్తి

ABN, First Publish Date - 2022-11-28T00:17:13+05:30

సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచేందుకు చెకుముకి సైన్స్‌ పోటీలు దోహదం చేస్తాయని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజర్షిషా

సంగారెడ్డి అర్బన్‌, నవంబరు 27 : సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచేందుకు చెకుముకి సైన్స్‌ పోటీలు దోహదం చేస్తాయని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. సంగారెడ్డిలోని జడ్పీ సమావేశ మందిరంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి జానవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. చెకుముకి జిల్లాస్థాయి పోటీల్లో ఆంగ్ల మాధ్యమ విభాగంలో కాశీపూర్‌ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు మొదటి స్థానంలో నిలవగా, ప్రభుత్వ తెలుగు మీడియం విభాగంలో దౌల్తాబాద్‌ జడ్పీహెచ్‌ఎ్‌స విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. ప్రైవేటు పాఠశాలల విభాగంలో విద్యానగర్‌ సెయింట్‌ ఆంథోనీస్‌ హైస్కూల్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మూడు పాఠశాలల విద్యార్థులు డిసెంబరు 9, 10, 11 తేదీల్లో సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రతాప్‌, జాన్‌పాల్‌, నాయకులు సోమశేఖర్‌, శశిధర్‌, బాలయ్య, ప్రశాంత్‌, మహేశ్‌, రఘ, మోహన్‌, చంద్రమోహన్‌, సువర్ణ, సాయితేజ, లతీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ జిల్లా పరిధిలో

నర్సాపూర్‌, నవంబరు 27: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి పోటీలు ఆదివారం నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీలో ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ నర్సింహారెడ్డి, ఎంఈవో బుచ్యానాయక్‌, రిటైర్డు హెచ్‌ఎం షఫియొద్దీన్‌, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జితేంద్ర పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు బాబురావు, పండరి, శ్రీనివాస్‌, రమేష్‌, రాజు, చంద్రశేఖర్‌, కామేశ్వరరావు, వెంకటరమణ, యోగి, శంకరచారి, గణేష్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising