ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్తవ్యస్తంగా రోడ్లు

ABN, First Publish Date - 2022-08-18T05:21:08+05:30

హత్నూర మండలంలోని కొన్యాల-అల్మాయిపేట రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది.

కంకర తేలిన కొన్యాల-అల్మాయిపేట రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్నూరలో రోడ్డుపై తేలిన కంకర

రాయికోడ్‌లో సైడ్‌వాల్‌ ధ్వంసమై ఐదేళ్లయినా పట్టించుకోని పాలకులు

హత్నూర/రాయికోడ్‌, ఆగస్టు 17: హత్నూర మండలంలోని కొన్యాల-అల్మాయిపేట రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది. కొన్నేళ్ల క్రితం నిర్మించిన మెటల్‌ రోడ్లపై బీటీ వేయకపోవడంతో నడవడానికి వీలు లేకుండా తయారైంది. నిత్యం ఈ రోడ్డుపై వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. బీటీ రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయని గతంలో ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేసినా.. పనుల ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. కాగా  రాయికోడ్‌ మండలంలోని సిరూర్‌ గ్రామ శివారులో గల మంజీరా నది బ్రిడ్జిపై నిర్మించిన రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిరూర్‌, రాయిపల్లి మధ్య గల ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమైన సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో దీని గుండా ప్రయాణించే నిజామాబాద్‌, మెదక్‌, రామాయంపేట, జోగిపేట, నారాయణఖేడ్‌, బీదర్‌, జహీరాబాద్‌ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి సైడ్‌వాల్‌ ధ్వంసమై ఐదేళ్లయినా ఇప్పటికీ దానికి కనీస మరమ్మతులు చేపట్టడం లేదు.



Updated Date - 2022-08-18T05:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising