ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

ABN, First Publish Date - 2022-09-26T04:51:38+05:30

నేటి తరానికి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తి అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం వావిలాల, మంగంపేటలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆవిష్కరించారు.

జిన్నారం మండలం మంగంపేటలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐలమ్మ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

జిన్నారం, సెప్టెంబరు 25: నేటి తరానికి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తి అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం వావిలాల, మంగంపేటలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాలను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అదే స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంగంపేటలో రజకుల కోసం త్వరలో కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, సర్పంచులు సుశాంతి, ప్రశాంతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజేష్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 

చాకలిఐలమ్మ విగ్రహానికి భూమి పూజ

పటాన్‌చెరు: తెలంగాణ సాయుధ పోరాట ధీర వనిత చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. పటాన్‌చెరులోని సాకిచెరువు కట్టపై విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణా విలీన దినోత్సవం సందర్భంగా ఐలమ్మ విగ్రహాలను పటాన్‌చెరుతో పాటు నియోజకవర్గంలోని జిన్నారం మండలం వావిలాలలో, మంగంపేటలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సాకిచెరువు కట్టపై కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు చుట్టూ చక్కని పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, నాయకులు మధుసూదన్‌రెడ్డి, అఫ్జల్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-26T04:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising