ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీహెచ్‌లో సెంట్రల్‌ వర్క్‌షాప్‌

ABN, First Publish Date - 2022-07-19T05:23:35+05:30

ఆధునిక యంత్రాలపై పరిశోధనల కోసం సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌)లోని ఫ్యాబ్రికేషన్‌ వర్క్‌షా్‌పలో సోమవారం సెంట్రల్‌ వర్క్‌షాప్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఐఐటీ హైదరాబాద్‌లో వర్క్‌షా్‌పలో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ప్రొఫెసర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐటీఐ విద్యార్థులకు వృత్తి విద్యలో నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ


కంది, జూలై 18: ఆధునిక యంత్రాలపై పరిశోధనల కోసం సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌)లోని ఫ్యాబ్రికేషన్‌ వర్క్‌షా్‌పలో సోమవారం సెంట్రల్‌ వర్క్‌షాప్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, పటాన్‌చెరు ఐటీఐలకు చెందిన 57 మంది విద్యార్థులకు ఐఐటీహెచ్‌ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి కర్రి బదరీనాథ్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై శిక్షణ ఇచ్చారు. వీటిలో యూనివర్సల్‌ మిల్లింగ్‌ మెషిన్‌, లేజర్‌ కటింగ్‌, ప్లాస్మా కటింగ్‌, ఆర్క్‌ వెల్డింగ్‌, రేడియల్‌ డ్రిల్లింగ్‌ మెషిన్‌లపై విద్యార్థులకు మెళకువలను నేర్పించారు. ఐఐటీహెచ్‌ చుట్టు పక్కల ఉన్న ఐటీఐలలో చదివే విద్యార్థుల నైపుణ్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఐఐటీహెచ్‌ ఈ వర్క్‌షాప్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు ఐఐటీహెచ్‌ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. ఈ సదుపాయం ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధించే దిశగా ఉంటుందన్నారు. సాంకేతిక ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్‌ వర్క్‌షాప్‌ అనేది ఐఐటీహెచ్‌లో ఒక ప్రత్యేక ఫ్లాట్‌ఫాం అని కొనియాడారు.  


 

Updated Date - 2022-07-19T05:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising