ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుకునూరుపల్లిలో అంబరాన్నంటిన సంబరాలు

ABN, First Publish Date - 2022-09-28T04:58:56+05:30

కుకునూరుపల్లి కేంద్రంగా కొత్తగా మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో మంగళవారం కుకునూరుపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి.

కుకునూరుపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం, మంత్రి, ఎంపీల చిత్రపటాలకు క్షీరాభిషేకం 

కొండపాక, సెప్టెంబరు 27: కుకునూరుపల్లి కేంద్రంగా కొత్తగా మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో మంగళవారం కుకునూరుపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. రహదారిపై టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ జెండాల చేతబూని ర్యాలీ నిర్వహించారు. టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేశారు. కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఎంపీటీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవీందర్‌, పీఎన్‌ఆర్‌ సంస్థ చైర్మన్‌ పోల్కంపల్లి నరేందర్‌ మాట్లాడుతూ ప్రజలకు పరిపాలన మరింత సులభం చేయడం కోసం కొత్త మండలాలను ఏర్పాటు చేశారన్నారు.  దీంతో 30 ఏళ్ల కల నెరవేరిందని చెప్పారు. ఈ సంబరాల్లో సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతినరేందర్‌, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యురాలు కోల సద్గుణరవీందర్‌, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కాసం నవీన్‌కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పీ.అమరేందర్‌, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కుకునూరుపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో కోనాయిపల్లి గ్రామంలో సర్పంచ్‌ మిట్టపల్లి వసంతరుషి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. 

Updated Date - 2022-09-28T04:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising