ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైనర్‌లో మంటలతో జింక్‌లోడ్‌ దగ్ధం

ABN, First Publish Date - 2022-01-21T05:28:20+05:30

జింక్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ కంటైనర్‌ అగ్నికి ఆహుతై, అందులోని రూ. 30 లక్షల విలువైన జింక్‌ బూడిదైంది.

కంటైనర్‌లో మంటలను ఆర్పుతున్నఅగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, జనవరి 20: జింక్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ కంటైనర్‌ అగ్నికి ఆహుతై, అందులోని రూ. 30 లక్షల విలువైన జింక్‌ బూడిదైంది. ఈ సంఘటన తూప్రాన్‌ మండల పరిధి నాగులపల్లి శివారులో హైవే 44 రోడ్డుపై గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మనోహరాబాద్‌ మండలం చెట్లగౌరారంలోని మెస్సర్స్‌ ఎంఎస్‌ ఆగర్వాల్‌ ఫౌండ్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి 13 టన్నుల జింక్‌ను హెచ్‌ఆర్‌ 38 టీ 6993 కంటైనర్‌లో జైపూర్‌కు తరలిస్తున్నారు. తూప్రాన్‌ మండలం నాగులపల్లి శివారులోని మాసాయిపేట స్టేషన్‌ వద్దకు చేరుకోగానే కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. గుర్తించిన డ్రైవర్‌ సకీర్‌, క్లీనర్‌ నాసిబ్‌లు లారీని సమీపంలోని బొమ్మారం గేటు వద్ద రోడ్డు పక్కన నిలిపివేశారు. రామాయంపేట నుంచి ఫైర్‌ ఇంజన్‌ను రప్పించి మంటలను ఆర్పే చర్యలు చేపట్టారు. ప్రమాదంలో లారీతోపాటు, కెమికల్‌ దగ్ధమైంది. తూప్రాన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

Updated Date - 2022-01-21T05:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising