ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకన్న తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం: ఎంపీపీ

ABN, First Publish Date - 2022-08-05T04:59:34+05:30

పుట్టిన బిడ్డకు డబ్బపాల కన్న తల్లిపాలు పట్టించడమే శ్రేయస్కరమని ఎంపీపీ లకావత్‌ మానస అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు

హుస్నాబాద్‌రూరల్‌, ఆగస్టు 4: పుట్టిన బిడ్డకు డబ్బపాల కన్న తల్లిపాలు పట్టించడమే శ్రేయస్కరమని ఎంపీపీ లకావత్‌ మానస అన్నారు. గురువారం హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌) గ్రామంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానస మాట్లాడుతూ.. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు పట్టించాలన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జయమ్మ, సర్పంచ్‌ సాయన్న, పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు రజిత, స్వరూప, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు

చేర్యాల/దౌల్తాబాద్‌: చేర్యాల ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో గురువారం ముస్త్యాల గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. తల్లిపాల విశిష్ఠతపై సర్పంచు పెడుతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీ కమర్‌ సుల్తానా అవగాహన కల్పించారు. సీడీపీవో శారద చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. గర్భిణులకు సీమంతం చేశారు. దౌల్తాబాద్‌ మండలం లింగరాజుపల్లి గ్రామంలో సర్పంచ్‌ కేత కనకరాజు తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బాలరాజ్‌, పంచాయతీ సెక్రెటరీ భరద్వాజ్‌, అంగన్వాడీ టీచర్‌ యశోద, ఆశా వర్కర్‌ లావణ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising