ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు అడ్డగింత

ABN, First Publish Date - 2022-10-18T05:17:43+05:30

మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సోమవారం దళితులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే, దాన్ని ఓ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిరుదొడ్డి, అక్టోబరు 17: మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సోమవారం దళితులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే, దాన్ని ఓ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. గ్రామానికి చెందిన మాదిగ సంఘం సభ్యులు మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడానికి 18 సర్వే నంబరులో 5 ఎకరాల భూమిలో ఎస్సీలకు, బీసీలకు పట్టాలు ఇచ్చారన్నారు. గతంలో కొంతమంది దళితులు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అమ్ముకున్నారని, ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి మొత్తం భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. కాగా ఈ విషయమై నాలుగురోజుల్లో విచారణ చేసి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-10-18T05:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising