ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా అంచనా ప్రకారం ఇదే చివరి బడ్జెట్: Raghunandan rao

ABN, First Publish Date - 2022-02-25T19:55:44+05:30

త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌లో 119 నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌లో 119 నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ... పాలకవర్గానికి ప్రతిపక్షాలకు నిధులలో వివక్ష చూపడం దురదృష్టకరమన్నారు. గత బడ్జెట్ లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదని విమర్శించారు. మూడేళ్ల నుంచి ఆగిపోయిన పెన్షన్, 57ఏళ్లకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. మ్యానిఫెస్టో ప్రకారం బడ్జెట్ ఉండాలని అన్నారు. ‘‘నా అంచనా ప్రకారం ఇదే చివరి బడ్జెట్’’ అని వ్యాఖ్యానించారు. 2018లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-25T19:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising