ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ గూడుపుఠానీలకు బీజేపీ అడ్డా

ABN, First Publish Date - 2022-01-14T05:12:40+05:30

రాజకీయ గూడుపుఠానీలకు బీజేపీ అడ్డా అని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. గురువారం ఆయన హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంద గ్రూపులున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ కలహాల గురించి మాట్లాడటం విడ్దూరమన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పార్టీకి కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక అర్హత లేదు

మురళీధర్‌రావ్‌.. ఒళ్లు దగ్గరపెట్టుకో

సంజయ్‌కి ఈటల రాజేందర్‌ గెలవాలని లేకుండె!

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ 



హుస్నాబాద్‌, జనవరి 13 : రాజకీయ గూడుపుఠానీలకు బీజేపీ అడ్డా అని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. గురువారం ఆయన హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంద గ్రూపులున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ కలహాల గురించి మాట్లాడటం విడ్దూరమన్నారు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం, కరీంనగర్‌లో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించడం మీ అంతర్గత కలహాలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రె్‌సను విమర్శించే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని మురళీధర్‌రావును హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేసే ముందు మీ పార్టీని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర టీఆర్‌ఎస్‌ ప్రాయోజిత పాదయాత్రగా అభివర్ణించారు. టీఆర్‌ఎ్‌సపై మాటలే తప్ప ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు చేయలేదన్నారు. వీరిది ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ వంటిదన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి ప్రజా సమస్యలను పక్కతోవ పట్టిస్తున్నాయన్నారు. బండి సంజయ్‌కి ఈటల రాజేందర్‌ గెలవాలని లేకుండేనని ఆరోపించారు. ఇందుకు దుబ్బాక, హుజూరాబాద్‌లో ఆయన పోషించిన పాత్రనే నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మెన్‌ బొలిశెట్టి శివయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, పార్టీ నాయకులు అక్కు శ్రీనివాస్‌, స్వర్ణలత, వల్లపు రాజు, సరోజన, బంక చందు, జంగపల్లి అయిలయ్య, మంద ధర్మయ్య, ప్రకాష్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-14T05:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising