ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలి

ABN, First Publish Date - 2022-10-18T05:07:31+05:30

ఎంచుకున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందడంతో పాటు ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభిస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆరవ జోన్‌ క్రీడా పోటీలు ప్రారంభం


 చేగుంట, అక్టోబరు17: ఎంచుకున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందడంతో పాటు ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. చేగుంట గిరిజన బాలికల క్రీడా పాఠశాలలో ఆరవ జోన్‌ క్రీడా పోటీలను ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన 14 పాఠశాలల నుంచి 545 మంది విద్యార్థులు 14 విభాగాల్లో పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. నేటి ఓటమి రేపటి గెలుపుగా ముందుకు సాగాలన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌కల్పిస్తూ ప్రభుత్వం వారి అభ్యున్నతికి పాటుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌, ఆర్‌సీవో సంపత్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ మమత, స్థానిక సర్పంచ్‌ శ్రీనివాస్‌, వివిధ పాఠశాలలకు చెందిన ఫిజికల్‌ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising