ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు

ABN, First Publish Date - 2022-04-18T04:43:14+05:30

మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం విచ్చల విడిగా ఏరులై పారుతోంది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 10 వరకు బెల్టుషాపులు నడుస్తున్నాయి.

అంకిరెడ్డిపల్లి వద్ద వినియోగంలోకి రాని పర్మిట్‌ రూమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండలంలో ఏరులై పారుతున్న మద్యం

చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు

ఒక్కో క్వార్టర్‌పై రూ. 10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు

రాయపోల్‌, ఏప్రిల్‌ 17: మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం విచ్చల విడిగా ఏరులై పారుతోంది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 10 వరకు బెల్టుషాపులు నడుస్తున్నాయి. ప్రతీ రోజు పలు గ్రామాల్లో సుమారు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా మద్యం తాగడం వల్ల పలు గ్రామాల్లో గొడవలు జరిగి కటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మండలంలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. మండలం ఏర్పాటు కాగానే రాయపోల్‌లో వైన్స్‌ ఏర్పాటు చేశారు. కాగా ఇటీవలే అంకిరెడ్డిపల్లి కేంద్రంగా మరో వైన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. బెల్ట్‌ షాపుల యజమానులు ఎమార్పీ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి ఒక్కో క్వార్టర్‌, బీరుపై రూ. 10 నుంచి 20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. 

పొలాలు, చెట్లే సిట్టింగ్‌ రూములు

కాగా అంకిరెడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేసిన వైన్స్‌కు సిట్టింగ్‌ రూం పర్మిషన్‌ఉన్నప్పటికీ నామ్‌కే వాస్తేగా షెడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో గజ్వేల్‌ - చేగుంట రహదారిపై పొలాల్లో, చెట్ల కింద ఎక్కడ చూసినా మద్యం సేవించే వారే కనిపిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలకు ఇది ఇబ్బందిగా మారింది.

పట్టించుకోని అధికారులు

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అబ్కారీ శాఖ అధికారుల ప్రోత్సాహంతోనే గ్రామాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలుమార్లు మండల సభలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో బెల్ట్‌ షాపులను నియంత్రించాలని విన్నవించినప్పటికీ ఫలితం దక్కలేదు. గతంలో పోలీసులు బెల్టుషాపులు నిర్వహించే వారిని గుర్తించి కేసులు నమోదు చేసేవారు. పోలీసులు కూడా పట్టించుకోక పోవడంతో బెల్టుషాపుల నిర్వాహకులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.




Updated Date - 2022-04-18T04:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising