ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం

ABN, First Publish Date - 2022-06-26T05:03:32+05:30

మండలంలోని పలు తండాల్లో మిషన్‌భగీరథ ద్వారా తాగు నీటి సరఫరాలో అధికారులు విఫలమయ్యారని పలు గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల ఆవేదన

శివ్వంపేట, జూన్‌ 25: మండలంలోని పలు తండాల్లో మిషన్‌భగీరథ ద్వారా తాగు నీటి సరఫరాలో అధికారులు విఫలమయ్యారని పలు గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన సమస్యలపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శివ్వంపేటలో లక్షల రూపాయలు వెచ్చించి గోదావరి జలాల కోసం ఏర్పాటు చేసిన సంపు నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తున్నా ప్రారంభించడం లేదని పలువురు సభ్యులు పేర్కొన్నారు. శివ్వంపేట పెద్దచెరువు ఆక్రమానికి గురైందని అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచు శ్రీనివా్‌సగౌడ్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. సర్వే చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ శ్రీనివా్‌సచారి పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్‌ మన్సూర్‌, ఎంపీడీవో నవీన్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T05:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising