ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో మలేరియా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పర్యటన

ABN, First Publish Date - 2022-07-05T05:56:48+05:30

సంగారెడ్డి జిల్లాలో మలేరియా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగయ్య సోమవారం పర్యటించారు.

సంగారెడ్డి, కంది, ఆర్సీపురం పీహెచ్‌సీల తనిఖీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌, జూలై 4:  సంగారెడ్డి జిల్లాలో మలేరియా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగయ్య సోమవారం పర్యటించారు. సంగారెడ్డిలోని ఇంద్రనగర్‌, మార్క్స్‌నగర్‌ యూపీహెచ్‌సీ, కంది, ఆర్సీపురం పీహెచ్‌సీలను సందర్శించి అందులోని ల్యాబ్‌ రికార్డులు తనిఖీ చేశారు. సంగారెడ్డిలోని ఇంద్రనగర్‌లో ఇటీవల మలేరియా కేసు నమోదు కావడం పట్ల ఆయన ఆ ఇంటి పరిసరాలను పరిశీలించి ఇంట్లో వాళ్లతో పాటు చుట్టు పక్కలవారి సుమారు 56 మంది బ్లడ్‌ శాంపిళ్లను సేకరించారు. వారం రోజుల క్రితం హాస్టల్‌గడ్డలో ఓ వ్యక్తికి డెంగీ  సోకినట్టు  తెలుసుకున్న ఆయన ఇంటిని సందర్శించి దోమల నివారణకు తీసుకున్న చర్యలు, యాంటీ లార్వా, స్ర్పే యాక్టివిటీ వివరాలను తెలుసుకున్నారు. ఆర్సీపురం పీహెచ్‌సీ పరిధిలోని అశోక్‌నగర్‌లో గత మే నెలలో వచ్చిన డెంగీ కేసుల వివరాలను తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించారు.   ఆయన వెంట సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ రాజు, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ భాస్కర్‌, మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ రజినీ, డాక్టర్‌ శశికర్‌, ఏఎన్‌ఎం నిర్మల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising