వీవోఏల సమస్యలు పట్టవా?: సీఐటీయూ
ABN, First Publish Date - 2022-10-18T05:14:07+05:30
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వీవోఏల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రశ్నించారు.
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 17: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వీవోఏల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రశ్నించారు. సంగారెడ్డిలోని సమైఖ్య కార్యాలయం ఎదుట సోమవారం వీవోఏలతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు రూ.21 వేలు అందజేయాలని కోరారు. రూ.పది లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని, ఐడీ కార్డులు ఇవ్వాలని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతలు కల్పించాలని, మహిళా వీవోఏలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐకేపీ వీవోఏలు అనిత, వీరేశం, ఉమా, మల్లేశ్వరి, ఊర్మిళ, మనిషా, రాజిరెడ్డి పాల్గొన్నారు.
సీఐటీయూ మహాసభల కరపత్రం ఆవిష్కరణ
సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో సోమవారం సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ఆవిష్కరించారు. డిసెంబరు 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు సిద్దిపేటలో నిర్వహించే రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాలను ఆయన కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, యశోద, నాయకులు వీరమణి, ప్రశాంతి, శిరీష, శశికళ, లక్ష్మిప్రసన్న, నందమ్మ, లక్ష్మి, శశిరేఖ, శాంతి, జ్యోతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:14:07+05:30 IST