ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం

ABN, First Publish Date - 2022-12-07T23:40:40+05:30

సిద్దిపేట రూరల్‌, డిసెంబరు 7: భవిష్యత్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఉంటుందని తోర్నాల గ్రామంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి

సిద్దిపేట రూరల్‌, డిసెంబరు 7: భవిష్యత్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఉంటుందని తోర్నాల గ్రామంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి సూచించారు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని ఇర్కోడ్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు బుధవారం పాఠశాల ఉపాధ్యాయుడు అరగొండ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలను విజ్ఞాన యాత్రలో భాగంగా సందర్శించారు. నీటి సంరక్షణ, నీటి వినియోగం, పంటల సాగు పద్ధతుల గురించి శ్రీదేవి క్లుప్తంగా వివరించారు. నీటి కుంటల ప్రాముఖ్యత వివరిస్తూ నీటిని పొదుపు చేయడంలో నీటి కుంటలు దోహదపడతాయన్నారు. దేశానికి వస్ర్తాలను అందించేందుకు పత్తి సాగు అవసరమని విద్యార్థులకు తెలియజేశారు. పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేయడం వల్ల కలిగే లాభాలను చెప్పారు. విత్తనాలను నేరుగా వెదజల్లే పద్ధతి, వరిసాగులో మెళకుల గురించి తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేసే వ్యవసాయంలో తోడ్పాటునందించడం వల్ల వ్యవసాయంలో తగిన అవగాహన వస్తుందని చెప్పారు. డాక్టర్‌ ఎన్‌.సాయినాథ్‌ మృత్తికా శాస్త్రం ప్రయోగశాలలోని పరికరాలు, వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన యంత్రాలను, వాటి ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. డాక్టర్‌ డీ.శ్వేత వాతావరణ సంబంధిత పరికరాలు, పొద్దు తిరుగుడులో చేబడుతున్న విత్తనోత్పత్తి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాదారి నాగరాజు, ఉపాధ్యాయులు ముకేష్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising