ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచారజాతుల అభివృద్ధికి చర్యలు

ABN, First Publish Date - 2022-12-16T00:13:31+05:30

సంచార, విముక్త జాతులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ దక్షిణ భారత బోర్డు మెంబర్‌ తుర్క నరసింహ పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తుర్క నరసింహ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 15: సంచార, విముక్త జాతులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ దక్షిణ భారత బోర్డు మెంబర్‌ తుర్క నరసింహ పేర్కొన్నారు. జిల్లాలో డీనోటిఫైడ్‌, సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు మెదక్‌ వచ్చిన ఆయన గురువారం కలెక్టరేట్‌లో జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌హాలులో సంక్షేమాధికారులు, అటవీ, మైన్స్‌, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ, వారి పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. సమాజంలోని అణగారిన ఎస్సీ. ఎస్టీ, బీసీ వర్గాల్లోని పలు ఉప కులాల వారికి నేటికీ రాజ్యాంగ ఫలాలు అందడం లేదని గుర్తించి కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నదన్నారు. జిల్లాలోని ఏయే ప్రాంతాల్లో సంచార జాతుల వారు నివసిస్తున్నారో గుర్తించి వారికి అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంక్షేమాశాఖాధికారులను ఆదేశించారు. ప్రతీ మండలంలోని గ్రామాల వారీగా డీఅండ్‌సీ కేటగిరీలలో ఉన్న జనాభా వివరాల జాబితా అందించాలని బీసీ అధికారికి, ఎస్సీ అఽభివృద్ధిశాఖ ద్వారా లబ్ధి చేకూర్చిన వివరాల జాబితా అందజేయాలని ఎస్సీ అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులు చక్కటి బోధనతో విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చి దిద్దేలా చూడాలన్నారు. విద్యావ్యవస్థలో లోపాలను గుర్తించి పటిష్ఠపరచాలన్నారు. సబ్జెక్టుల వారీగా సిలబ్‌సలో మార్పులు, చేర్పులపై సూచనలు ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు. అటల్‌ బిహారీ టింకర్‌ యోజన కింద పాఠశాలలో ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకు సాయాన్ని పొందవచ్చని, అవసరమైన పాఠశాలలు నివేదికలను ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసులు ఏమైనా నమోదై, సదరు కేసుల్లో నష్టపరిహారం చెల్లించినట్లయితే సమగ్ర నివేదికను అందించాలని పోలీసు అధికారులను అదేశించారు. నేరాలు చేసిన వారిలో సంచార జాతుల వారిని గుర్తించి వివరాలు అందించాలని, అదేవిధంగా వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి నేర ప్రవృత్తిని తగ్గించాలని, వారికి పునరావాసం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులు విజయలక్ష్మి, కేశురాం, జెంలానాయక్‌, డీఎ్‌ఫవో రవిప్రసాద్‌, డీఈవో రమే్‌షకుమార్‌, డీఎస్‌వో రాజిరెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising