ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్‌ కార్డుకు ఆధార్‌ సీడింగ్‌ చేయాలి: ఆర్డీవో

ABN, First Publish Date - 2022-08-05T04:58:47+05:30

బోగస్‌ ఓటరుకార్డుల ఏరివేతలో భాగంగా ఓటర్‌ కార్డుకు ఆధార్‌ ఆనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, ఆగస్టు 4: బోగస్‌ ఓటరుకార్డుల ఏరివేతలో భాగంగా ఓటర్‌ కార్డుకు ఆధార్‌ ఆనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. చేర్యాల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండలాల బీఎల్‌వోలతో శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆధార్‌సీడింగ్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ బీఎల్‌వో గరుడ యాప్‌లో వివరాలు పొందుపరచాలన్నారు. అలాగే సాధారణ ప్రజలు ఫారం నెం6-బి వ్యక్తిగతంగానైనా తహసీల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సీడింగ్‌ ప్రక్రియపట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఆరీఫా బేగం, లక్ష్మీనారాయణ, అశోక్‌, నరేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising