ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

ABN, First Publish Date - 2022-08-18T05:11:05+05:30

జహీరాబాద్‌ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మాణిక్‌రావు, జిల్లా కలెక్టర్‌ శరత్‌

జహీరాబాద్‌, ఆగస్టు 17: జహీరాబాద్‌ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం జహీరాబాద్‌లోని మున్సిపల్‌ కార్యాలయంలో జహీరాబాద్‌ పట్టణ అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు సంయుక్తంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... జహీరాబాద్‌ పట్టణ అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక తీసుకొని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జహీరాబాద్‌లో అభివృద్ధి పనులు జరిగేలా మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి పనులు అధికారంలో నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేసి పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అనంతరం జహీరాబాద్‌ పట్టణంలో రూ. 15 కోట్ల నిధులతో నిర్మిస్తున్న వ్యాపార సముదాయ దుకాణాలను ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా,  డీసీఎంఎస్‌ శివకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సుభా్‌షరావు, ఆత్మ కమిటీ చైర్మన్‌ పెంటారెడ్డి, నాయకులు తన్వీర్‌, తంజీం, నామ కిరణ్‌, బాబీ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యేను సన్మానించిన నాయకులు, రైతులు

కోహీర్‌ మండలంలోని పలు గ్రామాల్లో గల వక్ఫ్‌బోర్డు భూబాధితుల రైతుల భూముల సమస్యలను పరిగణలోకి తీసుకుని 300 మంది రైతులకు రైతుబీమా, రైతుబంధు వర్తించేలా అనుమతులు రావడంలో వారు హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సుభాష్‌రెడ్డి, ఖలీం, గణే్‌షరెడ్డి, శంకర్‌, అఖిల్‌, యాదవులు, అస్లం, వాజిద్‌, రాయిస్‌, రషీద్‌, రైతులు ఎమ్మెల్యేను  ఘనంగా సన్మానించారు. 


Updated Date - 2022-08-18T05:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising