ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతాంగ సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-05-23T04:37:57+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగంపై మొసలికన్నీరు కార్చుతూ సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు.

రైతుబజారులోని కూరగాయల రైతులకు డిక్లరేషన్‌ కరపత్రాలను అందజేస్తున్న ప్రతాప్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి

చేర్యాల, మే 22: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగంపై మొసలికన్నీరు కార్చుతూ సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని ముస్త్యాల, వీరన్నపేట గ్రామాల్లో ఆదివారం ఆయన రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబజారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతుల పాలిట ఆత్మబంధువు అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన సొంత జిల్లాలోని రైతులకైనా రుణమాఫీ అమలుచేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ధాన్యం పట్టకుండా, రైతాంగ ఇబ్బందులు పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రాల పర్యటన చేపట్టడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అన్నదాతలు ఆత్మస్థైర్యంతో జీవించారని, రానున్నరోజుల్లో మద్దతు ధర పొందాలన్నా, న్యాయం చేకూరాలన్నా కాంగ్రె్‌సతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్ము నర్సింగరావు, భాస్కర్‌రెడ్డి, తోళ్ల రాజేశ్వరి, నల్లగోని బాలకిషన్‌, సిద్ధారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T04:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising