వైభవంగా సహస్ర చండీ మహాయాగం ముగింపు
ABN, First Publish Date - 2022-12-31T23:23:54+05:30
తూప్రాన్ పట్టణ శివారులోని వెంకటాపూర్ (పీటీ)లోని శ్రీలలితాపరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహిస్తున్న సహస్ర చండీ మహాయాగంలో భాగంగా శనివారం 5వ రోజు పూర్ణాహుతి, రుత్విక్ సన్మానం ఘనంగా నిర్వహించారు.
తూప్రాన్, డిసెంబరు 31: తూప్రాన్ పట్టణ శివారులోని వెంకటాపూర్ (పీటీ)లోని శ్రీలలితాపరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహిస్తున్న సహస్ర చండీ మహాయాగంలో భాగంగా శనివారం 5వ రోజు పూర్ణాహుతి, రుత్విక్ సన్మానం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, దేవీ ఉపాసకులు సోమయాజుల రవీంద్రశర్మ పర్యవేక్షణలో కార్యక్రమాలను నిర్వహించారు. నైమిశారణ్యం పూజారి భాస్కరశర్మ, గానుగాపూర్ పూజారి ప్రసన్నభట్ హాజరయ్యారు. సహస్ర చండీయాగ మహోత్సవానికి జడ్పీచైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి, గజ్వేల్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్లు ఎన్‌సీ రాజమౌళిగుప్తా, బొంది రాఘవేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ హాజరయ్యారు. సహస్ర చండీయాగం నిర్వహించిన సోమయాజుల రవీంద్రశర్మను భక్తులు హంస వాహనంపై ఊరేగించి, పుష్పాభిషేకం నిర్వహించారు.
Updated Date - 2022-12-31T23:23:56+05:30 IST