ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యతో ఉజ్వల భవిష్యత్తు: డీఈవో

ABN, First Publish Date - 2022-01-23T04:31:43+05:30

బడి బయట పిల్లలకు విద్యతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మెదక్‌ జిల్లా విద్యాధికారి రమే్‌షకుమార్‌ పేర్కొన్నారు.

పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డీఈవో రమేష్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నశంకరంపేట, జనవరి 22: బడి బయట పిల్లలకు విద్యతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మెదక్‌ జిల్లా విద్యాధికారి రమే్‌షకుమార్‌ పేర్కొన్నారు. బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించే సర్వేలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని పలు ఇటుక బట్టీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇటుక బట్టీల్లో పని చేస్తున్నవారి బడి బయట పిల్లలను గుర్తించారు. పిల్లల తల్లిదండ్రులతో  ఆయన మాట్లాడుతూ పిల్ల భవిష్యత్తు కోసం బడిలో చేర్పించాలని పలు సూచనలు ఇచ్చి అవగాహన కల్పించారు. పిల్లలతో బట్టీల్లో పని చేయిస్తే చట్టరీత్యా తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లకు పైబడిన ప్రతి ఒక్కరూ బడిలో చేరాల్సిందేనని స్పష్టం చేశారు.  ఆయన వెంట ఎంఈవో యాదగిరి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రణీద్‌ కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి కర్రె పోచయ్య, సీఆర్పీలు ఉన్నారు. 

 

Updated Date - 2022-01-23T04:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising