వీధికుక్కల దాడిలో 4 మేకలకు గాయాలు
ABN, First Publish Date - 2022-08-05T05:21:09+05:30
వీధి కుక్కల దాడిలో 4 మేకలకు గాయాలైన సంఘటన కంది పరిధిలోని వెంకట్రావు మక్తాతండాలో చోటు చేసుకున్నది.
కంది, ఆగస్టు 4: వీధి కుక్కల దాడిలో 4 మేకలకు గాయాలైన సంఘటన కంది పరిధిలోని వెంకట్రావు మక్తాతండాలో చోటు చేసుకున్నది. కొన్నిరోజులుగా మండల పరిధిలోని చేర్యాల, కాశీపూర్, కంది గ్రామాల్లో వీధికుక్కల బెడద ఎక్కువైందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వెంటనే కుక్కల బెడదను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2022-08-05T05:21:09+05:30 IST