సిద్దిపేట జిల్లాలో 24 మందికి కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2022-08-04T05:53:52+05:30
జిల్లాలో బుధవారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సిద్దిపేట, ఆగస్టు 3 : జిల్లాలో బుధవారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 288 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మండలాల వారీగా దుబ్బాకలో 1, నారాయణరావుపేటలో 1, సిద్దిపేట అర్బన్‌లో 8, చేర్యాలలో 6, గజ్వేల్‌లో 4, పీహెచ్‌సీల వారీగా భూంపల్లిలో 1, తీగుల్ 3 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
Updated Date - 2022-08-04T05:53:52+05:30 IST