ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తిపై దాడి ఘటనలో 11 మంది నిందితుల అరెస్ట్‌

ABN, First Publish Date - 2022-07-06T05:09:56+05:30

మండలంలోని చీలమామిడి గ్రామంలో సోమవారం ఉదయం బేగరి నరేష్‌ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అదే గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్‌ చేసిన పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఝరాసంగం, జూలై 5: మండలంలోని చీలమామిడి గ్రామంలో సోమవారం ఉదయం బేగరి నరేష్‌ అనే  వ్యక్తిని కులం పేరుతో దూషించి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అదే గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జహీరాబాద్‌ డీఎస్పీ రఘు సమగ్ర విచారణ జరిపి మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు తెలిపారు. నిందితులు గొల్ల శ్రీనివాస్‌, గొల్ల రవి, గోపాల్‌, శేఖర్‌, రాములు, సంగన్న, రాంచెందర్‌, నర్సింహులు, శంకర్‌, మంగమ్మ, జనాబాయిలను అరెస్ట్‌ చేశామన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.  సమావేశంలో సీఐ భరత్‌ కుమార్‌, ఎస్‌ఐలు రాజేందర్‌ రెడ్డి, ఏడుకొండలు, సిబ్బంది ఉన్నారు.





Updated Date - 2022-07-06T05:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising