గ్రూప్-1 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ABN, First Publish Date - 2022-10-07T05:30:00+05:30
గ్రూప్-1 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : గ్రూప్-1 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాలను క్షుణంగా అర్థం చేసుకుని ఎటువంటి లో టుపాట్లు జరుగకుండా బాధ్యతతో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించా లని చెప్పారు. అక్టోబరు 16న జరుగనున్న పరీక్షలో జిల్లాలో 4058 అభ్యర్థులు హాజ రుకానున్న నేపథ్యంలో వారికి 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 13 మహబూబాబాద్‌లో, రెండు తొర్రూరులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు సౌకర్యవంతంగా డ్యూయల్ డెస్క్ సిట్టింగ్ ఉండాలని, ప్రతి గదిలో సరిపడ లైటింగ్, ఫ్యాన్లు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. వీటితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రథమ చికిత్స క్యాంపులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌ను ఆదేశించా రు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు అనుమతించేది లేదన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు తొర్రూరు, మానుకోట ఆర్టీసీ బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పా టు చేయాలని సూచించారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ మాట్లాడుతూ.. పోలీస్ అధి కారులు పరీక్ష కేంద్రాలను ముందస్తుగా సందర్శించి బందోబస్తు ఏర్పాటు చేయా లని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవోలు కొమురయ్య, రమేష్, డీఎస్పీ రఘు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-07T05:30:00+05:30 IST