ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-06T06:33:06+05:30

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌

మహబూబాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి గ్రామంలో మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండ నిర్వహించాల్సిన మెడికల్‌ క్యాంపులు, ప్రజల ఆరోగ్యం పట్ల తీసుకో వాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు, ఎంపీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండ జాగ్రత్తలు తీసుకోవాలని, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించేందుకు బ్లీచింగ్‌ పౌడర్‌ను ఉపయోగించి నీటిని శుద్ధి చే యాలని చెప్పారు. మెదడు వాపు, డెంగీ దోమల నిర్మూలనకు వారానికి ఒకసారి ఫాగింగ్‌ చేయాలన్నారు. మలేరియా, డెంగీ వ్యాప్తి కాకుండ నీటి నిల్వల్లో గంబూషియా చేపలు వదలాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్యం పాటించేలా వ్యక్తి గత పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ఓహెచ్‌ ఎస్‌ఆర్‌ ట్యాంకులను శుభ్రం చేసి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. జీపీ సొంత భవనాల్లో, అంగన్‌వా డీల్లో మిషన్‌ భగీరథ కనెక్షన్‌లు ఉండేలా చూడాలన్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌, శానిటైజర్‌లు వాడే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో సాయిబాబా, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంబరీష పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-06T06:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising