ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd News: పాపం ఈ 23 ఏళ్ల వివాహిత.. గచ్చిబౌలిలో విషాద ఘటన..

ABN, First Publish Date - 2022-07-31T03:31:59+05:30

కారు కొనేందుకు రూ.10 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో ఆ వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం: కారు కొనేందుకు రూ.10 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో ఆ వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన అప్పలస్వామి కుమార్తె సునీత (23) అదే ప్రాంతానికి చెందిన ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్‌కు ఇచ్చి 2019లో వివాహం చేశారు. పెళ్లి వేళ కట్నకానుకల కింద ఐదు తులాల బంగారం, రూ.14 లక్షల నగదు, 20 సెంట్ల భూమి ఇచ్చారు. వివాహ అనంతరం భర్తతో కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న సునీతను అత్తమామ, భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రమేష్ ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు మకాం మార్చారు.



గచ్చిబౌలి సుదర్శన్‌నగర్ కాలనీలో మెజిస్టిక్ ప్లజంట్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఈ నెల 24న అదనపు కట్నం విషయంలో రమేష్ భార్యను తీవ్రంగా కొట్టాడు. ‘కారు కోసం రూ.10 లక్షలు తీసుకురా’ అని సునీతకు హుకుం జారీ చేశాడు. భర్త తీరు గురించి సునీత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వేధింపులు తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సునీత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-07-31T03:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising