ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'హునార్ హాట్' ఎగ్జిబిషన్‌ కోసం చాలా రాష్టాలు పోటీ పడ్డాయి: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-02-27T21:13:49+05:30

'హునార్ హాట్' ఎగ్జిబిషన్‌ కోసం చాలా రాష్టాలు పోటీ పడ్డాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 'హునార్ హాట్' ఎగ్జిబిషన్‌ కోసం చాలా రాష్టాలు పోటీ పడ్డాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఇతర దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. 180 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 300హస్త కళల స్టాల్స్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేశాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులు ఇష్టమైన కళారూపాలు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. 730కోట్లు మైనార్టీ శాఖకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తోందన్నారు.450 మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఫెలో షిప్ అందిస్తుందన్నారు. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతామని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పద్మ అవార్డు గ్రహీతలు, ఇతర మేధావులు, కళాకారులు పాల్గొంటారని  కిషన్‌రెడ్డి  అన్నారు. 

Updated Date - 2022-02-27T21:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising