ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమెన్ ట్రాఫికింగ్ పై ఆరా తీసిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ Sunita laxma reddy

ABN, First Publish Date - 2022-06-23T00:50:28+05:30

మానవ అక్రమ రవాణా పై తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి(sunita laxma reddy)ఆరా తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మానవ అక్రమ రవాణా పై తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి(sunita laxma reddy)ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఎంత వరకు కట్టడి చేయగలిగామో పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో నమోదు అయిన కేసుల వివరాలు అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.


డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని చైర్ పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత పోలీసు అధికారులు స్పందిస్తూ ప్రతి రోజు 50 నుండి 60 మిస్సింగ్ కేసులు నమోదు అవుతుండగా అందులో 20 శాతం 15 నుండి 20 సంవత్సరాల లోపు వారేనని వివరించారు. నమోదు అవుతున్న మిస్సింగ్ కేసులలో అధిక శాతం ఇతర రాష్ట్రాల పిల్లలు, బాలకార్మికులేనని, వీరందరినీ గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. 

Updated Date - 2022-06-23T00:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising