ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వి-హబ్ ను సందర్శించిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

ABN, First Publish Date - 2022-03-17T23:12:48+05:30

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో కొనసాగుతున్న ‘వి-హబ్’ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో కొనసాగుతున్న ‘వి-హబ్’ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సందర్శించారు. వి-హబ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి ఇలాంటి ప్లాట్‌ఫామ్ ఉండటం ఎంతో ప్రోత్సాహకరం అని అన్నారు. వి-హబ్ బృథంతో జరిగిన సమావేశంలో చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సీఈఓ దీప్తి రావులను ప్రశంసించారు. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హ‌బ్ అని ఆమె పేర్కొన్నారు.


 హైద‌రాబాద్‌లో ఏర్పాటైన వీ హ‌బ్ ను మహిళలు సంద‌ర్శించి, పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలని కోరారు. వీ హ‌బ్ ఇప్ప‌టికే 2,194 స్టార్ట‌ప్‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేసిందని ఆమె అన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉందని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీ భాయి, కొమ్ము ఉమాదేవియాదవ్, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T23:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising