ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులు పూర్తి చేయించాలి

ABN, First Publish Date - 2022-01-20T05:16:05+05:30

పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని పూర్తి చేయించడంతో పాటు బిల్లులను త్వరగా చెల్లించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం

గద్వాల, జనవరి 19 : పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని పూర్తి చేయించడంతో పాటు బిల్లులను త్వరగా చెల్లించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఆదేశించారు. జడ్పీ కార్యాలయంలో బుధవారం రెండవ, మూ డవ, నాల్గవ, ఐదవ, ఆరవ స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు హాజరు కాకపోవడంపై జడ్పీ చైర్‌పర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సీఈవోను పిలిచి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. అనంతరం మిషన్‌ భగీరథ నీరు కొన్ని గ్రామాల్లో సక్రమంగా అందడం లేదని, వాటికి కార ణాలు చెప్పాలన్నారు. ఎర్రవల్లి కస్తూర్బా పాఠశాలకు, వీరాపురంలోని గురుకుల పాఠశాలకు మిషన్‌ భగీరథ మంచినీరు అందేలా చర్యలు తీసుకోవా లన్నారు. పంచాయతీ రాజ్‌ ఆధ్వర్యంలో కొనసాగు తున్న పనులను కాంట్రాక్టర్‌ ద్వారా పూర్తి చేయించి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని, యాసంగిలో సాగు తక్కువగా ఉన్నందున కూలీలకు ఉపాధి కల్పించా లని ఆదేశించారు. కరోనాను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కావాలని, గ్రామాల్లో పారిశుధ్యం పనులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో ఆయా గ్రామాల పరిధిలోని ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం లు విధిగా ప్రతీ ఇంటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని వివిధ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ మాట్లాడుతూ యాసంగిలో పంట మార్పిడిపై అధికారులు అవగాహన కల్పించినప్పటికీ రైతులు వరిపైనే ఆసక్తి చూపారని చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు, సాగునీరు సక్రమంగా అందే విధంగా చూడాలని సూచించారు. సమావేశంలో సీఈవో విజయానాయక్‌, అన్ని మండలాల జడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T05:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising