ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వానంగా ప్రాజెక్టు రోడ్డు

ABN, First Publish Date - 2022-12-31T23:15:26+05:30

ఉమ్మడి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వస్తున్న ప్ర కృతి ప్రేమికులకు రోడ్డు వసతి సౌకర్యం అను కూలంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.

వర్షాకాలంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంజూరై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాని నిర్మాణం

- ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

ఆత్మకూర్‌, డిసెంబరు 31: ఉమ్మడి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వస్తున్న ప్ర కృతి ప్రేమికులకు రోడ్డు వసతి సౌకర్యం అను కూలంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నందిమల్ల, మూలమల్ల గ్రామాల మీదుగా ఆత్మకూర్‌ మండల కేంద్రం చేరే వరకు 11 కిలో మీటర్ల మేర రూ.8కోట్ల 50 లక్షల ప్రాజెక్టు నిధుల తో 2016లో మంజూరు అయింది. మక్తల్‌ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. మొదట్లో పనులు వడివడిగా ప్రారంభించిన గుత్తేదారులు నిధులు సరిపోవడం లేదని మధ్యలోనే విస్తరణ పనులు నిలిపివేశారు. రోడ్డుపై కంకర, డస్ట్‌ వేసి వదిలేయడంతో వాహ నాలు వెళ్లిన ప్రతీసారి ధుమ్ము, ధూళి చేరి ముం దుగా వస్తున్న వాహనాలను గుర్తించలేనంతగా ఉండడంతో రోజువారీగా ప్రమాదాలు జరుగుతు న్నాయి. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఇది వరకు ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నా చేప ట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిధులు లేని కార ణంగా రోడ్డు మధ్యలోనే నిలిచిపోయిందని అధికా రులు అంటున్నారు.

పంచాయతీరాజ్‌ శాఖకు బదిలీ చేయాలి

ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు విడుదల చేస్తున్న క్రమంలో సాగు రైతులు ప్రతీ పంటకు పన్నులు కట్టేవారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టాక పన్నులు రద్దు చేయడంతో ప్రాజెక్టు నిధులు సమకూరడం లేదని అధికా రులు అంటున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి పంచాయతీరాజ్‌ శాఖకు రోడ్డును బదులాయించి తక్షణమే ప్రాజెక్టు రోడ్డు విస్తరణ పనులు చేపట్టా లని నందిమల్ల, మూలమల్ల గ్రామాల ప్రజలు, ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వస్తున్న ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-31T23:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising