ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైన్స్‌ లేకుంటే జీవితం లేదు

ABN, First Publish Date - 2022-11-27T23:08:29+05:30

సైన్స్‌ లేకుండా జీవితాన్ని ఊహించలేమని, మన జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి రూరల్‌, నవంబరు 27: సైన్స్‌ లేకుండా జీవితాన్ని ఊహించలేమని, మన జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నా రు. ఆదివారం జిల్లా పరిషత్‌ కార్యాలయం లో జిల్లా స్థాయి చెకుముకి సంబురాలు 2022 బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహు మతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ దినదినాభివృద్ధిలో సైన్స్‌ కీలకపాత్ర పోషి స్తుందని, అది లేకుండా ఆవిష్కరణలు లేవని, ఆవి ష్కరణలు లేకుండా, ఆర్థికంగా లేదా వైద్యపరంగా అభివృద్ధి చెందలేమని అన్నారు. శాటిలైట్‌ సేవల ఫలితంగా భారత్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చా యని, ముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌ సర్వీసులు, దూర ప్రాంత టెలీఫోన్‌ కాల్స్‌, ఇంటర్నెట్‌ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నా రు. టెలీమెడిసిన్‌ ద్వారా సుదూర ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయని, వీటితో పాటు ఆన్‌లైన్‌ టీచింగ్‌ ద్వారా దూరవిద్య కార్యక్రమాలను నిర్వహిం చడంతో పాటు ముందస్తు వాతావరణ సూచనలను అందిస్తున్నారని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపగ్రహం ప్రయోగించడానికి ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి ఇతర దేశాల ఉపగ్రహాల ను ప్రయోగించే స్థాయికి భారత్‌ చేరుకుందని అన్నా రు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి డి.శ్రీనివాసు లు, జిల్లా అధ్యక్షుడు బి.నరేందర్‌, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising