ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌ డ్రెస్సులు అందేదెన్నడో

ABN, First Publish Date - 2022-07-03T04:41:59+05:30

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 500 ప్రభుత్వ పాఠశాలలకు గాను 71,278 మంది విద్యార్థులకు రెండు జతల స్కూల్‌ డ్రెస్సులు అవసరం ఉంది.

పేట ఎమ్మార్సీలో ఉన్న స్కూల్‌ డ్రెస్‌ బట్టల బెండళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విడతల వారీగా దుస్తులు కుట్టేందుకు బట్టలు రాక 

- మొదటి విడత కింద 19,988 మంది విద్యార్థులకు  

- జిల్లాలో 71,278 మంది విద్యార్థులు

నారాయణపేట, జూలై 2 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 500 ప్రభుత్వ పాఠశాలలకు గాను 71,278 మంది విద్యార్థులకు రెండు జతల స్కూల్‌ డ్రెస్సులు అవసరం ఉంది. 2022-23 విద్యా సంవత్సరం జూన్‌ 13న ప్రారంభం కాగా ఇంకా విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్సులు అందడడంలో జాప్యం జరుగుతోంది. ఒక్కో విద్యార్థికి రెండు జతల స్కూల్‌ డ్రెస్సులు అందించనుండగా ఇందుకోసం ప్రభుత్వం బట్టలు సరఫరా చేస్తోంది. మూడు విడతలుగా జిల్లాకు బట్టలు రానుండగా ప్రతీ విద్యార్థికి రెండు జతలు కట్టేందుకు కలెక్టర్‌ నేతృత్వంలో విద్యాశాఖ అధికారులు మహిళా సంఘాలకు అప్పజెప్పనున్నారు. ఆయా మహిళా సంఘాల వారు బట్టలను పొంది విద్యార్థులకు డ్రెస్సులను కుట్టాల్సి ఉంది. దీంతో మహిళా సంఘాల్లోని దర్జీలకు స్థానికంగా ఉపాధి కల్గుతోంది. తాజాగా మొదటి విడత కింద 19,988 మంది విద్యార్థులకు రెండు జతలు స్కూల్‌ డ్రెస్సులు కుట్టేందుకు నారాయణపేట ఎమ్మార్సీ కేంద్రానికి బట్టలు వచ్చాయి. మొదటి విడత కింద వచ్చిన రెండు జతలు బట్టలను ముందుగా జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండో విడత కింద 51,288 మంది విద్యా ర్థులకు ఒక్కోజత బట్టలు, మూడో విడత కింద 51,288 మంది విద్యార్థులకు ఒక్కోజత బట్టలు ఈ నెలాఖరులోపు మహిళా సంఘాలకు అందించి కుట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.  కాగా ఆగస్టు 15వ తేదీలోపు విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్సులు అందే అవకాశముంది. 

Updated Date - 2022-07-03T04:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising