ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమిస్తాం

ABN, First Publish Date - 2022-08-05T05:19:04+05:30

వాల్మీకీ (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చటంతోనే సామాజిక ఎదుగుదల, అభివృద్ధి సాధ్యమని వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు రామ్‌లక్ష్మణ్‌ అన్నారు.

పట్టణంలో ర్యాలీ చేపట్టిన వాల్మీకి బోయలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - తహసీల్దార్‌ కార్యాలయాల ముందు ధర్నాలో నాయకులు

పాలమూరు/ దేవరకద్ర/ మూసాపేట/ రాజాపూర్‌, ఆగస్టు 4 : వాల్మీకీ (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చటంతోనే సామాజిక ఎదుగుదల, అభివృద్ధి సాధ్యమని వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు రామ్‌లక్ష్మణ్‌ అన్నారు. గురువారం పట్టణంలో వాల్మీకి రామాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వాల్మీకులను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా గుర్తించటం సరికాద న్నారు. పక్కనున్న కర్ణాటకలో పూర్తిగా ఎస్టీ జాబితాలో ఉన్న తమను తెలంగాణలో బీసీ ఏ గా చూడటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌ తమ జాతికి ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. అనంతరం అర్బన్‌ తహసీల్దార్‌కు పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. కా ర్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏఈ మద్దిగట్ల కృష్ణ, గౌరవాధ్యక్షులు యుగంధర్‌ నాయుడు, వెంకట్రాములు, బండల శ్రీను, అంజి, రామకృష్ణ, శివకుమార్‌, విజయ్‌కుమార్‌, రాములు, పి.విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

ఫ వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చాలనే అంశంపై దేవరకద్రలోనూ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉప తహసీల్దార్‌ శివరాజుకు వినతి పత్రం ఆందజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులు సంతోష్‌, రాములు శ్రీనివాసులు, ఆంజనే యులు, రవి, గోపాల్‌ పాల్గొన్నారు.

ఫ మూసాపేటలో వాల్మీకి సంఘం మండల అధ్యక్షుడు జానంపేట కృష్ణ య్య ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో అచ్చాయపల్లి, జానంపేట గ్రామాల సర్పంచ్‌లు చంద్రశేఖర్‌, శ్రీని వాసులు, సంఘం మండల నాయకులు కొండయ్య, తిరుపతయ్య, నారాయణ, గణేష్‌, మల్లేష్‌, బాలరాజు, దాసరిపల్లి రాజు, బాలయ్య వాల్మీకులు పాల్గొన్నారు.

రాజాపూర్‌ : వాల్మీకి బోయ కులస్థులను ఎస్టీ జాబితాల్లో చేర్చాలని గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు వాల్మీకి సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తమ డిమాం డ్లతో కూడిన వినతిపత్రం తహసీల్దార్‌ శంకర్‌కు అందజేశారు. కార్యక్రమంలో కురుమయ్య, దస్తగిరి, రాము, రాజు, కురుమూర్తి, శ్రీశైలం, శివ, శ్రీహరి, మల్లేష్‌ పాల్గొన్నారు.

వాల్మీకి ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలి 

జడ్చర్ల : తెలంగాణ వాల్మీకి ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి, రూ. 1000 కోట్లు కేటాయించాలని తెలంగాణ వాల్మీకి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంకల జంగయ్య గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-05T05:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising