ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయాం

ABN, First Publish Date - 2022-04-04T05:00:18+05:30

సమర్థవంతమైన నా యకుడు అయిజ తిర్మల్‌రెడ్డి అని, మంచి నా యకుడిని కోల్పోయామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

తిర్మల్‌ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

- ఉత్తనూరులో తిర్మల్‌రెడ్డి దశదిన కర్మ

అయిజ, మార్చి 3: సమర్థవంతమైన నా యకుడు అయిజ తిర్మల్‌రెడ్డి అని, మంచి నా యకుడిని కోల్పోయామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దివంగత మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి దశదిన కర్మ సభ ను ఆదివారం అయిజ మండలం ఉత్తనూర్‌ గ్రామంలోని ఎన్‌టీఆర్‌ మినీస్టేడియంలో నిర్వ హించారు. మొదట ఖమ్మం ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి  తిర్మల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా  మంత్రి మొదటగా తిర్మల్‌రెడ్డి విగ్రహానికి నివాళి  అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యసాధకుడైన వ్యక్తిని కోల్పోయిందన్నారు. ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసే వ్యక్తి తిర్మల్‌రెడ్డి అని కొనియాడారు. తిర్మల్‌రెడ్డి కుటుంబ సభ్యులలో ఎవరికైనా రాజకీయాలపై ఆసక్తి ఉంటే తనవంతుగా పూర్తిస్థాయిలో సహకారం, తోడ్పాటు అందిస్తానన్నారు. ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యాభివృద్ధికి తిర్మల్‌రెడ్డి అందించిన తో డ్పాటును వివరించారు. గద్వాల జిల్లా ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం,  ఖమ్మం ఎమ్మెల్యే రామిరెడ్డి దా మోదర్‌రెడ్డి , మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మాట్లాడు తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తిర్మల్‌ రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, మాజీ ఎంపీపీ సుందర్‌రాజు,  నాయకులు సుందర్‌రాజు,  తిమ్మారెడ్డి, టీ ఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-04-04T05:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising