ఆయిల్‌పామ్ సాగులో లక్ష్యాన్ని అధిగమించాం
ABN, First Publish Date - 2022-12-31T22:57:44+05:30
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని అధిగమిం చామని జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేష్ తెలిపారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 31: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని అధిగమిం చామని జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేష్ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయం లో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జిల్లాలో మూడు ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా జూలైలో కార్యాచరణ మొదలు పెట్టామన్నారు. డిసెంబరు నెలాఖరు వరకు 787 మంది రైతులు 3,042 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేశారన్నారు. కలెక్ట ర్ ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందన్నారు. మరో మూడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటల సాగు లక్ష్యంగా పని చేస్తున్నామని అందుకు అనుగుణంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు తమని సంప్ర దించాలని కోరారు.
త్రైపాక్షిక ఒప్పందం
ఆయిల్‌పామ్ తోటల సాగు కోసం ప్రభుత్వం ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌తో కలిపి రైతులు త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటు న్నట్లు ఉద్యానశాఖ అధికారి సురేష్ తెలిపారు. ప్రభుత్వం, ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సహకారంతో ఆయిల్ పామ్ తోటల సాగు జరుగుతుందన్నారు. పరస్పర ఒప్పంద అంగీకార పత్రంతో ప్రభుత్వ నిబంధనల మేరకు కంపెనీ రైతుల నుంచి ఆయిల్‌పామ్ పంట గెలలను కొంటుందని వివరించారు. ఈ మేరకు శనివారం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన రైతు ముష్టి బాలీశ్వరయ్య కంపెనీ, ప్రభుత్వంతో చేసుకున్న అంగీకార పత్రాన్ని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమక్షంలో స్వీకరించారు.
Updated Date - 2022-12-31T22:57:49+05:30 IST