చెక్‌డ్యాంల ఏర్పాటుతో జల వనరులు పుష్కలం
ABN, First Publish Date - 2022-12-15T22:37:35+05:30
చెక్‌డ్యాముల ఏర్పాటు ద్వారా జల వనరులు పుష్కలంగా ఉన్నాయని, జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యవసాయ సాగు అభివృద్ధి చెందుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- నిర్మాణంతో జిల్లాలోని కరువును శాశ్వతంగా దూరం చేశాం
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి రూరల్, డిసెంబరు 15: చెక్‌డ్యాముల ఏర్పాటు ద్వారా జల వనరులు పుష్కలంగా ఉన్నాయని, జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యవసాయ సాగు అభివృద్ధి చెందుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి మండలంలోని పడమటి తండా, చిమనగుంటపల్లి చెక్‌డ్యామ్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాకు ముఖ్యమంత్రి 11 చె క్డ్యాంలు మంజూరు చేశారని, వాటిలో తొమ్మిది పూర్తికాగా, రెండు పూర్తి కావల్సి ఉందని అన్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టం రికార్డు స్థాయిలో పెరిగిం దని, రాష్ట్రంలోనే భూగర్భ జలాల లభ్యతలో వన పర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. చెక్‌డ్యాములు, వాగులు, కుంటలు, కాలువలు, రిజర్వాయర్లు పునరుద్ధరించి, పశు సంపద, వృక్ష సంపదను అభివృద్ధి చేయడం జరి గిందని పేర్కొన్నారు. చెక్‌డ్యాంల నిర్మాణంతో జిల్లాలోని కరువును శాశ్వతంగా దూరం చేశామని, పంటలు పుష్కలంగా సాగవు తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 98వేల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, రాష్ట్రంలోనే వ్యవసాయ రంగం అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. త్వరలో జిల్లాకు వ్యవసాయ అధారిత పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ అడ్వయిజర్ విజయ్ ప్రకాష్, చీఫ్ ఇంజనీర్ హమీద్‌ఖాన్, రఘునాథ్‌రావు, ఈఈ మధు సూదన్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రికి సన్మానం
వనపర్తి అర్బన్ : నూతనంగా ఎన్నికైన మా ర్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్ గురువా రం మంత్రి నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో కలిసి సన్మానించారు. మార్కెట్ క మిటీ చైర్మన్‌గా ఎన్నికైనందుకు మంత్రికి ధన్యవా దాలు తెలిపారు. అనంతరం రమేష్‌గౌడ్‌ను మంత్రి సన్మానించారు. మునిసిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులున్నారు.
బుద్దారం పెద్ద చెరువు పరిశీలన
గోపాల్పేట : గోపాల్పేట మండలం బుద్దా రం పెద్ద చెరువును గురువారం మంత్రి నిరంజన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. బుద్దారం పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారు స్తున్నామని, మార్పుతో రైతులు రెండుసార్లు పం టలు సాగు చేసుకున్నా నీటి నిల్వ తగ్గదన్నారు. అనంతరం మ్యాపును పరిశీలించి, రెవెన్యూ అధి కారులకు సూచనలు చేశారు. సర్పంచ్ పద్మమ్మ, తహసీల్దార్ సునిత ఉన్నారు.
Updated Date - 2022-12-15T22:37:37+05:30 IST