ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైట్‌ డ్యూటీలపై వీఆర్‌ఏల ఆందోళన

ABN, First Publish Date - 2022-12-16T23:18:28+05:30

నైట్‌డ్యూటీలు వేయడాన్ని నిరసిస్తూ గ్రామ రెవెన్యూ సహాయ కులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం తహసీ ల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందిస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా

గద్వాల/గట్టు, డిసెంబరు 16 : నైట్‌డ్యూటీలు వేయడాన్ని నిరసిస్తూ గ్రామ రెవెన్యూ సహాయ కులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం తహసీ ల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల జేఏసీ చైర్మన్‌ రాములు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పని చేస్తున్న వీఆర్‌ఏ నరేందర్‌ నైట్‌ డ్యూటీ చేసి, ఉద యం ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. జాబ్‌చార్ట్‌లో నైట్‌ డ్యూటీలు లేకపోయినా, రెవెన్యూ అధికారులు బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు. సమ స్యల పరిష్కారం కోసం 80 రోజులకుపైగా సమ్మె చేశామని తెలిపారు. ఆ సందర్భంగా మునుగోడు ఎన్నిక పూర్తికాగానే సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట, పూర్తి కాగానే మరోమాట మంచిది కాదన్నారు. అనం తరం తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు. ధర్నాలో జిల్లా కోకన్వినర్‌ వెంకటే శ్వర్లు, మండల అధ్యక్షుడు కావలి మహేష్‌, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌, వీఆర్‌ఏలు సుధాకర్‌, రాములు, మహబూబ్‌, శ్రీనివాసులు, వెంకటేష్‌, దేవమ్మ, మొగిలి, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

- గట్టు మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు నిరసన తెలిపారు. జాబ్‌చార్ట్‌ ప్రకారం కాకుండా ఇతర పనులను బలవంతంగా చేయించడం తగదన్నారు.

Updated Date - 2022-12-16T23:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising