ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధును వినియోగించుకోండి

ABN, First Publish Date - 2022-04-08T04:49:27+05:30

దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు.

దళితబంధుకు దరఖాస్తు చేసుకున్న గ్రామస్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌  ఆశిష్‌ సంగ్వాన్‌

- నాచహళ్లిలో లబ్ధిదారులతో మాటామంతి 


వనపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 7: దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. గురువారం వనపర్తి మండలంలోని నాచహళ్లి గ్రామంలో ఆయన పర్యటించి దళితబంధుకు దరఖాస్తు చేసుకున్న 11మందితో మాట్లాడారు. అనంతరం ఆయన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో మెనూ పాటించడం లేదని గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఉపాధ్యాయులపై మండిపడ్డారు. పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడిపోవడం గమనించి వెంటనే భవనాన్ని మార్చాలని, గ్రామ సర్పంచ్‌కు సూచించారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్న నర్సరీ, వైకుంఠధామం, సెగ్రిగేషన్‌లను పరిశీలించారు. సెగ్రిగేషన్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం అమలు చేయడం లేదని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీవో రవీంద్రబాబు, గ్రామ కార్యదర్శికి నోటీసు ఇవ్వాలని డీపీవోకు సూచించారు. 

Updated Date - 2022-04-08T04:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising