ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 నుంచి పట్టణ ప్రగతి

ABN, First Publish Date - 2022-05-18T05:47:09+05:30

పాలమూరు పురపాలికలో ఈనెల 20 నుంచి జూన్‌ 5 వరకు నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నా మని మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు అన్నారు.

మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సమస్యలు గుర్తించి పరిష్కరించాలి

- మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు

మహబూబ్‌నగర్‌, మే 17 : పాలమూరు పురపాలికలో ఈనెల 20 నుంచి జూన్‌ 5 వరకు నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నా మని మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు అన్నారు. పట్టణ ప్రగతిలో వార్డుల వారీగా స్థానిక సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. మంగళవా రం మునిసిపల్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్‌ అత్యవర సమావే శంలో ఆయన మాటట్లాడారు. పట్టణ ప్రగ తిలో పారిశుధ్య పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తడిపొడిచెత్త సేకరణ, ఓపెన్‌ ప్లాట్లు, స్థలాలలో చెత్త, ముళ్ల కంప లేకుండా చూడటం, వీధుల్లో రోడ్లుపై చెత్తలేకుండా చర్యలు తీసుకోవడం. మురుగుకాలువల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాల న్నారు. అదేవిధంగా విద్యుత్‌ సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, పాతభవనాల గుర్తింపు వంటివి చేయాలన్నారు. అదేవిధంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హరితహారం ద్వారా ఈ ఏడాది మునిసిపాలిటీ పరిధిలో పెద్దఎత్తు న మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలన్నారు. నర్సరీలలో ఇప్పటికే అధిక సంఖ్యలో మొక్కలను పెంచుతున్నందున హరితహారం కార్యక్రమాన్ని ఉద్య మంలా చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతిలో వార్డులకు ఇన్‌చార్జీలను నియమిం చాలని, వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఉంటాయని అందరూ కో ఆర్డినేట్‌ చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ తాటగణేష్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising