ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరు

ABN, First Publish Date - 2022-12-31T23:17:58+05:30

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్‌జీవోస్‌ నిస్వార్థంగా రాజీలేని పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రాజీవ్‌రెడ్డి, ఆర్‌.చంద్రా నాయక్‌, కోశాధికారి డా.కృష్ణమోహన్‌లు అన్నారు.

పట్టణ కమిటీకి నియామకపు ఉత్తర్వులు అందజేసిన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు జి.రాజీవ్‌రెడ్డి

పాలమూరు, డిసెంబరు 31 : ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్‌జీవోస్‌ నిస్వార్థంగా రాజీలేని పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రాజీవ్‌రెడ్డి, ఆర్‌.చంద్రా నాయక్‌, కోశాధికారి డా.కృష్ణమోహన్‌లు అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని టీఎన్‌జీవోస్‌ హాలులో టీఎన్‌జీవో మహ బూబ్‌నగర్‌ పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో వారు మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లను తట్టుకుని పనిచేస్తున్న సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సంఘం నీడలో పరిష్కరించుకుందామని పిలు పునిచ్చారు. పట్టణ అధ్యక్షుడిగా పి.మహేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి.కర్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా బి. కృష్ణకుమార్‌ గౌడ్‌, సహాయ కార్యదర్శి బండారి రాధిక, కోశాధికా రి చాంద్‌పాషా, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రమేష్‌బాబు, ప్రచార కార్యదర్శి రాజ్‌కుమార్‌, సభ్యులుగా ఎన్‌.నరేష్‌ కుమార్‌ నాయుడు, ఎ.రోహిణి, అసోసి యేట్‌ అధ్యక్షుడిగా పి.అనిల్‌కుమార్‌, ఉపాధ్యక్షు లుగా ఎండీ షౌకత్‌అలీ, బీఎస్‌ రవిరాజ, కె.రవీందర్‌, వి.శైలజ, సహాయ కార్యదర్శులుగా ఎ.రమేష్‌, జి.శ్రీనివాస్‌, అజీమొద్దీన్‌, ప్రచార కార్యరద్శి బడిదుద్దీన్‌, సభ్యులుగా ఎస్‌.రాజేందర్‌, వివేక్‌, కె.ప్రణీన్‌కుమార్‌లను ఎన్నుకున్నారు. కమిటీని ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-12-31T23:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising