ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎఫ్‌వోను సన్మానించిన టీఆర్‌ఎస్‌ నాయకులు

ABN, First Publish Date - 2022-08-05T05:23:18+05:30

బదిలీపై వెళుతున్న జిల్లా అటవీశాఖ అధికారి సీహెచ్‌ గంగారెడ్డిని గురువారం టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన చాంబర్‌లో సత్కరించారు.

బదిలీ డీఎఫ్‌వోను సన్మానిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 4 : బదిలీపై వెళుతున్న జిల్లా అటవీశాఖ అధికారి సీహెచ్‌ గంగారెడ్డిని గురువారం టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన చాంబర్‌లో సత్కరించారు. ఆరేళ్లుగా జిల్లాలో పనిచేసిన ఆయన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌ను ఎంతగానో అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చేలా చేశారని, పిల్లలమర్రి అభివృద్ధితోపాటు అడవులను పెంచడంలో తనవంతు కృషి చేశారని కొనియాడారు.కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 

డీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ

మహబూబ్‌నగర్‌ అటవీశాఖ అధికారిగా సిరికొండ సత్యనారాయణ గురువారం బాధ్యత లు చేపట్టారు. డీఎఫ్‌ఓ గంగారెడ్డి పదోన్నతిపై హైదరాబాద్‌ వెళుతుండటంతో ఆయన స్థానంలో సత్యనారాయణ నియమితులయ్యారు. 1992లో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిగా ఉద్యోగప్రస్థానం ప్రారంభించిన ఈయన తరువాత పదోన్నతిపై నల్గొండ డీఎఫ్‌వోగా పని చేశారు.  ఖమ్మం, వరంగల్‌ జిల్లా డీఎఫ్‌వోగా పనిచేసిన ఆయన 2019 నుంచి 2022 వరకు హరితహారం కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖలో నోడల్‌ అధికారిగా పనిచేసి ఈతవనాలు, తాటి, కర్జూరా చెట్లు పెద్దఎత్తున నాటించారు. పాలమూరు జిల్లాలో హరితహారం కార్యక్రమం వందశాతం విజయవంతం చేసేందుకు తన వంతు పాత్రపోషిస్తానని తెలిపారు. 



Updated Date - 2022-08-05T05:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising