ఉన్నత స్థాయికి ఎదగాలి : డీఈవో రవీందర్
ABN, First Publish Date - 2022-12-07T23:11:56+05:30
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా చదువుకోవాలని డీఈవో రవీందర్ అన్నారు.
ఛాత్రోపాధ్యాయులైన విద్యార్థులతో డీఈవో రవీందర్, ఇతర అధికారులు
హన్వాడ, డిసెంబరు 7 : విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా చదువుకోవాలని డీఈవో రవీందర్ అన్నారు. బుధవారం హన్వాడ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు జిల్లా స్థాయిలో మంచి పేరు తీకురావాలని కోరారు. 14 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ బాలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:11:59+05:30 IST