ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ మండలంలో మూడు క్రీడా ప్రాంగణాలు

ABN, First Publish Date - 2022-05-16T05:27:17+05:30

ప్రతీ మండలంలో మూడు ప్రాంతా ల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలం గుర్తించాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు తహసీల్దార్లకు సూచించారు.

వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్థలాలను గుర్తించండి

- తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), మే 15 : ప్రతీ మండలంలో మూడు ప్రాంతా ల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలం గుర్తించాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు తహసీల్దార్లకు సూచించారు. ఆదివారం కలెక్టర్‌ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సర్వేయర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మండ లంలో మూడు గ్రామీణ క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి నందున స్థలాలకు సంబంధించి సోమవారం ఉదయంలోగా నివేదికలు ఇవ్వా లని ఆదేశించారు. అదేవిధంగా బృహత్‌ పల్లెప్రకృతివనాలకు గతంలో స్థలాలను గుర్తించారని, ఇంకా ఎక్కడైనా పెండింగ్‌ ఉంటే వెంటనే స్థలాలు గుర్తించాలన్నా రు. క్రీడాప్రాంగణాల కోసం ఎలాంటి వివాదాలు లేని  స్థలాలు గుర్తించాలని సూచించారు. ఎకరాకు తగ్గకుండా స్థల సేకరణ చేయాలన్నారు. ముందుగా పెద్ద గ్రామపంచాయతీకి సంబందించిన స్థలం, గ్రామానికి దగ్గరా ఉండే స్థలా లను గుర్తించాలని తెలిపారు. రాష్ట్ర గ్రామీణ క్రీడాప్రాంగణాలకు సంబంధిం చిన కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచే ప్రారంభించారని, మంత్రి వ్రీనివాస్‌గౌడ్‌ చొరవతో పలు గ్రామాలకు స్పోర్ట్స్‌ మెటీరియల్‌ను కూడా పంపినట్లు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులంతా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సీతారామారావు, ఆర్డీవో పద్మవ్రీ, డీఆర్‌డీవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, సరే ్వ ల్యాండ్స్‌ రికార్డ్‌ ఏడీ  శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising